Homeహైదరాబాద్latest Newsవిద్యార్థి చదువుకు భరోసా

విద్యార్థి చదువుకు భరోసా

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన విద్యార్థి అయ్యోరి అమూల్య కు పాలిటెక్నిక్ కోర్సులో సీట్ రావడం జరిగింది. అయితే ఆ అమ్మాయి చదువుకు సంవత్సరానికి 15 వేల రూపాయలు అవుతుండగా, ఆ ఖర్చులు భరించే స్థితిలో తన కుటుంబం లేకపోవడంతో ఆ విద్యార్థిని పరిస్థితిని స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం కన్వీనర్ గొల్లపల్లి గణేశ్ ధర్మపురి వాస్తవ్యుడైన సారంగుల అమర్నాథ్ దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆ విద్యార్థి చదువుకు అయ్యే ఖర్చులు తన స్వచ్ఛంద సంస్థ వికసిత్ భారత్ 2047 ఫౌండేషన్ ద్వారా చెల్లించడానికి ముందుకు వచ్చారు. అందుకు గాను మొదటి సంవత్సరం ఖర్చులు రూ. 15 వేలు ఈ రోజు అమ్మాయికి అందజేయడం జరిగింది. వారికి సంస్థ తరుపున ధన్యవాదాలు. కార్యక్రమంలో దాత సారంగుల అమర్నాథ్, ఉపాధ్యాయులు కాసర్ల వెంకట రమణ, రావులపెల్లి శ్రీనివాస్, దహాగం గణేశ్, చంద్రమౌళి, దినేష్, సంజీవ్, పుష్పలత, స్వప్న, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img