Homeజాతీయం6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు గుడ్‌న్యూస్‌

6 కోట్ల మంది పీఎఫ్ చందాదారులకు గుడ్‌న్యూస్‌

న్యూఢిల్లీ: 2019-20 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్‌కు సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. ఈ నిర్ణ‌యంతో దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతార‌ని ఈపీఎఫ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈపీఎఫ్ ఖాతాల్లోని నిధిపై 8.15 శాతం వడ్డీని ప్రస్తుతం జమ చేస్తారు. మిగిలిన 0.35 శాతం వడ్డీని ఈ ఏడాది డిసెంబరులో జమ చేస్తారన్నారు. ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం డిసెంబరులో మరోసారి జరుగుతుంది.

Recent

- Advertisment -spot_img