ఇదేనిజం, ధర్మారం : జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ప్రెస్‌క్లబ్ ఏర్పాటైంది. డీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటపలుకుల వెంకట్ ప్రారంభంచారు. వెంకట్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల కోసం నిరంతరం కృషి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజేశం, జిల్లా అధ్యక్షులు సబితం లక్ష్మణ్, డీజేఎఫ్ ధర్మారం మండల అధ్యక్షులు గుండేటి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఎదుల్ల ప్రభాకర్, ఉపాధ్యక్షులు తాళ్ళ మధుకర్ గౌడ్, మూల దిలీప్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు కల్లెపల్లి కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి సత్యనారాయణ, డీజేఎఫ్ మండల కోశాధికారి బెక్కం హరికృష్ణ, సంయుక్త కార్యదర్శి పిట్టల స్వరూపరాణి, కార్యవర్గ సభ్యులు నర్సయ్య, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.