ప్రకాశం జిల్లా దర్శిలో ఈవీఎం ధ్వంసం కలకలం రేపింది. దర్శి మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. టీడీపీ కౌన్సిలర్ వీసి రెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు. దాంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి దర్శి డీఎస్పీ చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.