HomeజాతీయంEWS: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ పై సుప్రీం చారిత్రాత్మక తీర్పు

EWS: అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ పై సుప్రీం చారిత్రాత్మక తీర్పు

EWS: ఆర్ధికంగా వెనుక బడిన (EWS) రిజర్వేషన్ లపై సుప్రీమ్ కోర్ట్ చరిత్రత్మాకమైన తీర్పు వెల్లడించింది. విద్య ఉద్యోగాల్లో వారికీ 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 లో చేసిన 103 వ రాజ్యాంగ సవరణను ఐదుగురు సభ్యుల ధర్మాసనం 3-2 మెజారిటీ తో ఆమోదించింది. ధర్మాసనం లోని మెజారిటీ సభ్యులు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పార్టీవాలాలు EWS ను ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించడం సహెతుకమైనదిగా పేర్కొన్నారు. ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లాంఘించడం లేదన్నారు.

విభేదించిన ప్రధాన న్యాయమూర్తి

మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.ఆర్థిక ప్రాతిపదికన తెచ్చిన EWS కోటాపై అభ్యంతరం లేదని, ఇందులోంచి sc, st, ఓబీసీ పేదలను మినహాయించడం సరికాదంటూ రాజ్యాంగ సవరణను తన తీర్పులో కొట్టివేశారు. భట్ అభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి ఏకీభవించారు..

Recent

- Advertisment -spot_img