Homeహైదరాబాద్latest Newsప్రెగ్నెంట్‌ మహిళకు కాలం చెల్లిన మందులు

ప్రెగ్నెంట్‌ మహిళకు కాలం చెల్లిన మందులు

Idenijam, Webdesk : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆదివాసులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షలాగానే మిగిలిపోతోంది. చదువు రాదనో..తెలివి లేదనో..లేక అడిగేవాళ్లు లేరనా! భార్య ప్రెగ్నెంట్‌తో ఉందని ఆస్పత్రికి తీసుకెళ్తే..స్కానింగ్ చేసి కాలం చెల్లిన మందులు, ఆహార పదార్థాలు ఇచ్చారని ఓ బాధితుడు వాపోయిన ఘటన ఆదిలాబాద్ జిల్లా కులంగూడ గ్రామంలో జరిగింది. ఈ విషయంపై డాక్టర్‌ను సంప్రదిస్తే..ఏం కాదని, ఇవి వాడొచ్చన్నాడని తెలిపాడు. తమకు ఇచ్చిన పల్లిపట్టీ, నెయ్యి దుర్వాసన వస్తున్నాయని తెలిపాడు. పుట్టబోయే బిడ్ద, తల్లి ఆరోగ్యంపై తీసుకునే శ్రద్ధ ఇదేనా అని అధికారులకు చెంపచెల్లుమనేలా ఓ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఏం తెలియదని, పని చేసుకొని బతికేవాళ్లను ఇలా మోసం చేయొచ్చా అని బాధితుడు ప్రశ్నించాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తన భార్యకు మెరుగైన వైద్యం, మందులు అందించేలా చూడాలని కోరాడు.

Recent

- Advertisment -spot_img