Homeహైదరాబాద్latest Newsహెడ్ కానిస్టేబుల్ పై F.I.R

హెడ్ కానిస్టేబుల్ పై F.I.R

– స్థల వివాదంలో మున్సిపల్ కమిషనర్ కంప్లయింట్
– విధులకు ఆటంకం కలిగించాడని SHO కు లేఖ
– కేసు నమోదు చేసిన పోలీసులు

ఇదేనిజం, అదిలాబాద్ ప్రధాన ప్రతినిధి : ఓ స్థల వివాదం కేసులో పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ కలిగిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఐపీసీ 447, 427, 186 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లోని వివరాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ ఉన్న షేక్ మురాద్ అలీ పట్టణంలోని రిక్షాకాలనీలో నెలన్నర రోజుల క్రితం కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే తనకు చెందిన కొంత స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణం ప్రారంభించాడని అతని ఇంటి పక్కనే ఉండే అజీమ్ పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్ తోపాటు కలెక్టర్ ప్రజావాణి, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ అధికారులు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. స్థల వివాదం నేపథ్యంలో కోర్టుకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

అయినా వాటిని పట్టించుకోకుండా ఇటీవల మురాద్ అలీ బౌండరీ వాల్ నిర్మాణం ప్రారంభించాడు. అయితే పనులను ఆపివేయాలని అక్కడికి మున్సిపల్ సిబ్బంది రాగా, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తన స్థలాన్ని ఆక్రమించి బౌండరీ నిర్మించాడని అజీమ్ సైతం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇతరుల స్థలాన్ని ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా బౌండరీ వాల్ కట్టడం, మున్సిపల్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించిన మురాద్ అలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ అధికారులు పట్టణ టూటౌన్ ఎస్ హెచ్ఓకు లేఖ రాశారు. దీంతో టూటౌన్ పోలీసులు ఐపీసీ 447, 427, 186 కింద కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img