Homeహైదరాబాద్latest Newsవీసా స్లాట్లు రిలీజ్..ఈ తప్పులు చేయొద్దు

వీసా స్లాట్లు రిలీజ్..ఈ తప్పులు చేయొద్దు

Idenijam, Webdesk : అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి శుభవార్త. ఫాల్ సీజన్‌కు సంబంధించి వీసా స్లాట్లు(F1 Visa Slots) విడుదల చేసినట్లు యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్ ప్రతినిధులు తెలిపారు. దిల్లీలోని యూఎస్ ఎంబసీతో పాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా నగరాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ నెల 31 వరకు స్లాట్లు రిలీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా జూన్, జులై నెలలకు సంబంధించిన వీసా స్లాట్లను రిలీజ్ చేస్తామని చెప్పారు. విద్యార్థి వీసా ప్రక్రియ పూర్తయ్యాక బిజినెస్ వీసా (B1, B2) స్లాట్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వీసా స్లాట్ల బుకింగ్ చేస్తామంటూ బుకీలు రంగంలోకి దిగారు. ఒక్కో స్లాట్‌కు రూ. 5000 వేల నుంచి రూ. 20,000 వరకూ వసూలు చేస్తున్నారు. దిల్లీలో వీసా ప్రక్రియ సులువుగా ఉంటుందంటూ నమ్మిస్తూ..అక్కడే స్లాట్ బుక్ చేసుకొనేలా పథకాలు రచిస్తున్నారు. ఫేక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు ఇవ్వొద్దని అధికారులు పదేపదే చెబుతున్నా విద్యార్థులు గత్యంతరం లేక అడ్డదారులు తొక్కుతున్నారు. విద్యార్థి ఖాతాలో డబ్బులు జమచేసి లక్ష రూపాయలకు రూ.1000 చొప్పున తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ లెక్కన 50 లక్షలకు రూ.50 వేలు ఖర్చవుతుంది. ఇవే కాక బ్యాంకు అఫిడవిట్, ఐటీ రిటర్న్స్, పే స్లిప్ప్, బ్యాంకు స్టేట్‌మెంట్, లోన్ లెటర్‌తో పాటు యూనివర్సిటీల్లో ఫేక్ అడ్మిషన్స్ తో విచ్చలవిడిగా సొమ్ము కాజేస్తున్నారు.

యూఎస్ వీసా నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారంమే కాన్సులేట్ అధికారులు వీసాలు మంజూరు చేస్తారు. ఏ మాత్రం సందేహం వచ్చినా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేయవచ్చు. ఈ విషయాలన్నిటనీ దృష్టిలో పెట్టుకొని కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూ ఇవ్వడం ముఖ్యం.

Recent

- Advertisment -spot_img