Homeఅంతర్జాతీయంFacebook : త్వరలో ఫేస్‌బుక్‌ పేరు మారనుందా

Facebook : త్వరలో ఫేస్‌బుక్‌ పేరు మారనుందా

Facebook plans name change to reflect metaverse focus : త్వరలో ఫేస్‌బుక్‌ పేరు మారనుందా.. ఫేస్‌బుక్‌ పేరు త్వరలో మారబోతున్నదా..

తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోతున్న మెటావర్స్‌కు ఎక్కువ ప్రచారం కల్పించేలా సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కొత్త పేరును పెట్టబోతున్నారా..

అంటే అవుననే తెలుస్తున్నది.

ఫేస్‌బుక్‌ సంస్థ ఈ నెల 28న నిర్వహించే కనెక్ట్‌ కాన్ఫరెన్స్‌లో జుకర్‌బర్గ్‌ సంస్థ కొత్త పేరును ప్రకటిస్తారని భావిస్తున్నారు.

ఇందులో ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఒక్యులస్‌లాగే ఫేస్‌బుక్‌ను కూడా ఒక అనుబంధ కంపెనీగా చూపిస్తారని, సంస్థ పేరు మెటావర్స్‌ ప్లాట్‌ఫాం మీదుగా ఉంటుందని తెలుస్తున్నది.

మెటావర్స్‌ అనేది కొత్త తరహా కమ్యూనికేషన్‌ విధానం.

వర్చువల్‌ విధానంతో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది.. కలిసి ఉన్న, ఒకరినొకరు తాకుతున్న భావనతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మాట్లాడుకోవచ్చు.

దీనినే మెటావర్స్‌ అంటారు. వర్చువల్‌/ఆగ్యుమెంట్‌ రియాలిటీతో ఇది సాధ్యం అవుతుంది.

ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ రూ.522 కోట్ల జరిమానాను విధించింది.

దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వనందుకు ఈ ఫైన్‌ వేసినట్టు అధికారులు తెలిపారు.

జిఫీ సంస్థను ఫేస్‌బుక్‌ గతేడాది కొనుగోలు చేసింది. అయితే, ఈ కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్‌బుక్‌ నియంత్రిస్తున్నదన్న ఆరోపణలపైబ్రిటన్‌ కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ ఈ విచారణ చేపట్టింది.

Recent

- Advertisment -spot_img