Homeహైదరాబాద్latest Newsఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

  • రెండు నెలల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేదరి దేవవరం డిమాండ్

ఇదేనిజం, లక్షెట్టిపేట : మండుటెండల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న రెండు నెలల బిల్లులను వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేదరి దేవవరం డిమాండ్ చేశారు. బుధవారం అయన మండలంలోని దౌడేపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు పని చేసే ప్రదేశంలో కనీస సౌకర్యాలయిన తాగునీరు, మెడికల్ కిట్టు, టెంట్ లేవన్నారు. పెండింగ్ లో ఉన్న గత రెండు నెలల బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్దయెత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి రమణారెడ్డి, నాయకులు దుర్గం దేవన్న, ఆకుల రామన్న, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img