Homeతెలంగాణవాస్తవాలు అంగీకరించాల్సిందే

వాస్తవాలు అంగీకరించాల్సిందే

– ప్రభుత్వ ఉద్యోగుల జీతాలూ సకాలంలో పడటం లేదు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: వాస్తవాలు చేదుగా ఉన్నా అంగీకరించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాలు సకాలంలో పడటం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఆర్‌బీఐ, కాగ్‌ నుంచి తీసుకున్న సమాచారాన్నే ప్రజల ముందు ఉంచామని చెప్పారు.శ్వేతపత్రం జరిగిన చర్చలో రేవంత్​ రెడ్డి మాట్లాడారు. ‘రాష్ట్ర నిధుల విషయంలో ఆర్‌బీఐ రోజూ ఓ నివేదిక ఇస్తుంది. 2014-15లో 300 రోజులు మనకు మిగులు నిధులు ఉన్నాయి. గత పదేళ్లలో కనీసం 150 రోజులు కూడా మిగులు నిధులు లేవు. వాస్తవాలు దాచి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగులు సకాలంలో వారి లోన్లు, బిల్లులు కట్టలేకపోవడంతో వారిని ఎగవేతదారులుగా బ్యాంకులు చూస్తున్నాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదు. మన కుటుంబసభ్యుడు చేసినా తప్పును తప్పుగా అంగీకరించాలి. ఈ వాస్తవాలు కొందరికి చేదుగా ఉండొచ్చు.. ఇంకొందరికి కళ్లు తెరిపించి ఉండొచ్చు. ప్రజలు అన్నీ గుర్తించారు కాబట్టే.. పదేళ్ల తర్వాత మాకు అధికారం ఇచ్చారు. ఎవరినో కించపరిచేందుకో.. తక్కువ చేసి చూపించేందుకో తీసుకొచ్చింది కాదు ఈ శ్వేతపత్రం.’ అని రేవంత్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img