Homeక్రైంHyderabad​లో కల్తీ Chocolates దందా : Crime News

Hyderabad​లో కల్తీ Chocolates దందా : Crime News

– సుప్రజా ఫుడ్స్​ పేరుతో హైదర్​గూడలో తయారీ
– ప్రమాదకర కెమికల్స్​ వాడుతున్నట్లు తేల్చిన ఫుడ్​ సేఫ్టీ అధికారులు

ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో కల్తీ దందా కలకలం రేపుతోంది. ఇటీవల కొంతకాలంగా కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఐస్​క్రీమ్, బిస్కెట్ల తయారీ కేంద్రాలపై దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. తాజాగా కల్తీ చాకెట్ల దందాను గుర్తించారు. రాజేంద్రనగర్ పరిధి హైదర్​గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో నడుస్తున్న కల్తీ చాక్లెట్ల దందా బుధవారం బయటపడింది. అనూస్ ఇమ్లీ, క్యాడీ జెల్లి పేరుతో నిర్వాహకులు చాక్లెట్లను తయారు చేస్తున్నారు. వీటి తయారీలో ప్రమాదకర కెమికల్స్ ను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. మురికిగా ఉన్న చోటే చాక్లెట్లను తయారు చేసి వాటికి ఆకర్షణీయమైన బ్రాండెడ్ స్టిక్కర్లు అతికించి మార్కెట్‌లో అమ్ముతున్నారు. కుళ్లిపోయిన చింతపండును మరిగించగా వచ్చిన గుజ్జును చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కానీ అనుమతి లేకుండా చాక్లెట్ల తయారీ కేంద్రాన్ని నడుపుతూ కల్తీ చేస్తున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాటిని మార్కెట్​లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.


క్వాలిటీ లేని ఫుడ్ ఐటమ్స్ కొనొద్దు

కాగా, ఇటీవల హైదరాబాద్‌లో కల్తీ ఐస్ క్రీం దందా కూడా వెలుగులోకి వచ్చింది. కొందరు కేటుగాళ్లు ప్రమాదకర కెమికల్స్ వాడి ఐస్ క్రీమ్​లు తయారు చేసి వాటికి బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి అమ్ముతున్నారు. మేకింగ్ పరిశ్రమలపై దాడులు చేసిన ఫుడ్ సెప్టీ అధికారులు వాటిని సీజ్ చేశారు. అయితే బయట చాకెట్లు, ఐస్‌క్రీంలు కొనే ముందు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నాణ్యతలేని చాక్లెట్లు పిల్లలకు కొనివ్వటం ద్వారా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img