HomeతెలంగాణFalknuma train accident:ఫలక్‌నుమా రైలులో ప్రమాదం.. ఏడుబోగీలు పూర్తిగా దగ్ధం

Falknuma train accident:ఫలక్‌నుమా రైలులో ప్రమాదం.. ఏడుబోగీలు పూర్తిగా దగ్ధం

Falknuma train accident:  హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలు లో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు అలముకున్నాయి. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లోఏడుబోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img