HomeHealthపడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రధాన కారణాలు ఇవే

పడిపోతున్న సంతానోత్పత్తి రేటు.. ప్రధాన కారణాలు ఇవే

1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021 నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక ‘వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో సంతానోత్పత్తి రేటు 1.6గా ఉండగా.. భారతదేశంలో 1.98గా, చైనాలో 1.7గా ఉన్నట్టు వివరించింది.

భారత్‌లోనూ తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు
లాన్సెట్ జర్నల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. 1950లో మనదేశంలో ఫెర్టిలిటీ రేటు 6.2గా ఉండేది. 2021 నాటికి అది 2.0 కంటే తక్కువకు పడిపోయింది. 1950లో మహిళల్లో మొత్తం సంతానోత్పత్తి రేటు 4.5 కంటే ఎక్కువ ఉండేది. కానీ అది 2021 నాటికి 2.2 కి తగ్గింది. సంతానోత్పత్తి రేటు 2050 సంవత్సరం నాటికి 1.29 కి, 2100 సంవత్సరం నాటికి 1.4 కి పడిపోవచ్చని అంచనా వేసింది.

సంతానోత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణాలు ఇవే
దేశంలో మారిన వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపుటలవాట్లలో మార్పులు, యాంత్రిక జీవనశైలి, పని ఒత్తిళ్ళు, ఆందోళన, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి అంశాలు సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతున్నట్టు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సంతానోత్పత్తి రేటులో తగ్గుదల అనేది ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపి దేశాల ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img