Homeహైదరాబాద్latest Newsఇది మామూలు సాహసం కాదు భయ్యా…ఆరు ఏనుగులకు..పోయించాడు - Farmer dare to protect his...

ఇది మామూలు సాహసం కాదు భయ్యా…ఆరు ఏనుగులకు..పోయించాడు – Farmer dare to protect his bulls from Elephant attack in Vijayanagaram

  • ఎద్దుల కోసం ఏనుగులతో పోరాటం!
  • Farmer dare to protect his bulls from Elephant attack in Vijayanagaram

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : మామూలుగా ఒక ఏనుగు ఘీంకారం చేస్తూ దగ్గరికి వస్తుంటేనే భయంతో పరుగులు తీస్తాం. ప్రాణాలను కాపాడుకునేందుకు మెరుపు వేగంతో దూరంగా వెళ్తాం. ఆపద నుంచి బయటపడ్డాం అనుకొని హమ్మయ్య అంటాం. కానీ విజయనగరంలో ఓ రైతు చేసిన సాహసం వింటే షాక్ను అవ్వాల్సిందే. తన ఎద్దులను కాపాడుకునేందుకు ఏనుగులకు ఎదురొడ్డి నిలిచాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు ఏనుగులు మూకుమ్మడిగా ఆ రైతు మీదికి వచ్చినా ఏ మాత్రం జడియకుండా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే..

విజయనగరం జిల్లా జిమ్మయ్యవలస మండలం పెదకొదమలో తిరుపతిరావు అనే రైతు నాటుబండినే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులతో పాటు భవన నిర్మాణాలకు ఇసుక తరలిస్తూ బతుకు బండి లాగుతున్నాడు. రోజూవారి పనిలో భాగంగానే తన ఎద్దులబండితో పనికి వెళ్తున్నాడు.

ఒక్కసారిగా పక్కనే ఉన్న చెట్లపొదల్లోంచి ఏనుగుల గుంపు ఆ బండి మీదికి వచ్చింది. ఆ రైతు వెంటనే బండి దిగి ఏనుగులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. తన ఎడ్లను ఎలాగైనా కాపాడుకోవాలని వాటిని బండిని విడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే క్రమంలో ఏనుగులు బండిని నుజ్జునుజ్జు చేశాయి. ఎలాగోలా వాటిని విడిపించగా ఎడ్లు తమ ప్రాణాలకు కాపాడుకునేందుకు అక్కడినుంచి పరుగెత్తాయి. తర్వాత ఏనుగులు కూడా భయంతో వెళ్లిపోయాయి.

వినడానికి ఈ ఘటన భయానకంగా ఉన్నా ఆ గ్రామ వాసులకు ఇటువంటివి అలవాటేనట. తరచూ ఏనుగుల గుంపు దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయని స్థానికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారులు స్పందించి ఏనుగులను దూరంగా తరలించాలని కోరుతున్నారు.

Read More :

Recent

- Advertisment -spot_img