Homeజిల్లా వార్తలుఆయిల్ఫాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు

ఆయిల్ఫాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు

ఇతర దేశాల నుండి రానున్న సైంటిస్టులు – రైతులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు :జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాస్ సింగ్

ఇదేనిజం : జగిత్యాల ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల వికెబి ఫంక్షన్హాల్లో ఈనెల 12 బుధవారం రోజున ఉదయం 10 గంటలక రైతులకు ఆయిల్ ఫాంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఆయిల్ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఫ్రాన్స్, ఇండోనేషియా, మలేషియా, దేశాల నుండి అలాగే హైదరాబాద్ నుండి శాస్త్రవేత్తలు వస్తున్నారని, అయిల్ ఫాం సాగు విధి విధానాలపై తెలుపనున్నారని పేర్కొన్నారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే శాస్త్రవేత్తలను అడిగి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. వీరితో పాటు ఆయిల్పాం ప్రతినిధులు ఫ్యాక్టరీలయజమానులు తదితరులు వస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఆయిల్ సాగు చేసే రైతులు ఇతర రైతులు పాల్గొని ఆయిల్ ఫాం సాగులాభాలపై పూర్తి వివరాలు ಅಡಿಗಿ తెలుసుకో వచ్చునని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img