Homeహైదరాబాద్latest NewsBodhan : ధాన్యం డబ్బుల కోసం సొసైటీకి తాళం వేసిన రైతులు

Bodhan : ధాన్యం డబ్బుల కోసం సొసైటీకి తాళం వేసిన రైతులు


ఇదేనిజం, బోధన్: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల సహకార సంఘంలో ధాన్యం డబ్బుల కోసం రైతులు శుక్రవారం సొసైటీకి తాళం వేశారు. ఈ సొసైటీలో గత ఏడాది దాన్యం డబ్బులు పెద్ద ఎత్తున గోల్మాల్ అయినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ పౌరసరఫరాల శాఖ అధికారులు కాసులకు కక్కుర్తి పడి, ఎత్తోండ సహకార సంఘం కు అండగా నిలిచారు. ప్రస్తుతం రైతులకు, రావాల్సిన కోటి ఏనాభై లక్షల రూపాయల ధాన్యం డబ్బులు అందకపోవడంతో రైతులు తమకు రావలసిన డబ్బులను వెంటనే చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా సహకార సంఘం సిబ్బంది పాలకులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం రైతులు ఎత్తోండ సహకార సంఘమునకు తాళం వేశారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఎత్తోండ సహకార సంఘం పరిధిలోని 114 మంది రైతులు యాసంగి పండించిన పంటను ఎత్తోండ సహకార సంఘానికి ఇచ్చి రెండు నెలలు కావస్తున్నా ఇంకా తమకు రావాల్సిన డబ్బులు కోటి ఎనబై లక్షల రూపాయలను ఇవ్వడం లేదంటూ సహకార సంఘానికి తాళం వేసి తహసీల్దార్ కి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ సునీత, ఏఓ శ్రీనివాస్ రావు రైతులతో మాట్లాడి రైతులను సముదాయించారు. డబ్బులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంఘం కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో వచ్చిన వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి రావాలని సంఘం సిబ్బందిని ఆదేశించారు.

Recent

- Advertisment -spot_img