Homeహైదరాబాద్latest Newsజీలుగు విత్తనాల కోసం రైతుల పడిగాపులు.. ప్రభుత్వం మారిన మారని రైతుల కష్టాలు

జీలుగు విత్తనాల కోసం రైతుల పడిగాపులు.. ప్రభుత్వం మారిన మారని రైతుల కష్టాలు

  • 10 – 15 రోజుల నుండి ఎదురుచూస్తున్న అందని జీలుగ రైతులు
  • ఉదయం 5 గంటల నుండే పడిగాపులు
  • క్యూ లైన్లలో నిల్చోలేక పట్టా పాస్ బుక్ లు క్యూలు గా పెడుతున్న వైనం
  • కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు తప్పని తిప్పలు

ఇదే నిజం, ధర్మపురి/వెల్గటూరు: జీలుగ విత్తనాల కోసం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని రైతులు పడిగాపులు కాస్తున్నారు. దాదాపుగా పదిహేను రోజుల నుండి ఉదయం 5 గంటల నుండి 50 మంది రైతులు క్యూ లైన్ లో నిల్చోని జీలుగా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులు క్యూ లైన్లలో నిల్చోలేక వాళ్ళ పట్టా పాసు బుక్ లు క్యూలో పెట్టీ అక్కడ విత్తనాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది . రైతుల వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద జీలుగ విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేయగా మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రైతులు సుమారుగా పదిహేను రోజుల నుండి క్యూ లైన్ లలో నిల్చుని విత్తనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ..దాదాపుగా 50 మంది రైతులు పది నుండి పదిహేను రోజుల ఇక్కడ ఎదురుచూస్తున్నామని అయినా జీలుగు విత్తనాలు అందడం లేదని మరియు మాకు జీలుగు విత్తనాలు సమయానికి అందకపోవడం వల్ల మా పొలం పనులకు ఆటంకం కలుగుతుందని , వ్యవసాయ శాఖ అధికారులకు ఈ గోడును చెప్పుకొగ వారు రేపు రండి , మాకు మీటింగ్ లు ఉన్నాయి , ఎల్లుండి రండి అని నిర్లక్ష్యపు మాటలు చెప్తున్నారని రైతులు తెలిపారు. ఈ నిర్లక్ష్యపు ధోరణిని మానుకోవాలని ప్రభుత్వం ఈ విషయంపై చొరవ తీసుకొని వెంటనే రైతులకు సరిపడా విత్తనాలు పంపిణీ చేయాలని మా రైతుల తరఫునుండి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img