Homeతెలంగాణఅక్రమ అడ్మిషన్స్ , అధిక ఫీజులను నియంత్రించాలి

అక్రమ అడ్మిషన్స్ , అధిక ఫీజులను నియంత్రించాలి

రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అక్రమ అడ్మిషన్స్ , అధిక ఫీజులను నియంత్రించి ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటి మెంబర్ ప్రవీణ్​ రెడ్డి. ఈ సందర్బంగా ఉన్నత విద్యా మండలి చైర్మన్​ టీ.పాపి రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో దోస్త్​ వెబ్​సైట్​ ద్వారా చేపట్టాల్సిన డిగ్రీ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అడ్మిషన్ ప్రక్రియ నిలిపివేయడం జరిగిందని, కానీ కొన్ని ప్రైవేట్ కళాశాలలు ధనార్జనే ద్యేయంగా నిబంధనలను భేఖాతరు చేస్తూ అడ్మిషన్స్ చేపడుతూ విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు. డిగ్రీ అడ్మిషన్స్ ప్రక్రియపై ప్రభుత్వం నుండి వెలువడిన నిబంధనలు అతిక్రమించి అడ్మిషన్స్ చేపట్టిన కళాశాలల గుర్తింపు రద్దు చేయాలనీ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా దోస్త్​ పరిధిలోకి రాని ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో త్రొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిభందనలు అతిక్రమిస్తూ, ధనార్జనే పరమావధిగా వ్యవహరిస్తున్న అన్ని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకొని, పేద, మధ్య తరగతి విద్యార్థులకు న్యాయం జరిగేలా, అక్రమ అడ్మిషన్స్, అధిక ఫీజులు నియంత్రిచేందుకు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలను దోస్త్​ ద్వారా అడ్మిషన్స్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ కార్యదర్శి చిరిగే శివకుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుమన్ శంకర్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img