Homeజిల్లా వార్తలుమహాలక్ష్మి పథకంతో భారీగా పెరిగిన మహిళా ప్రయాణికులు

మహాలక్ష్మి పథకంతో భారీగా పెరిగిన మహిళా ప్రయాణికులు

-స్థానం లేక బస్సు ఆపని ఆర్టీసీ డ్రైవర్
-మరిన్ని బస్సులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్న మహిళలు

ఇదే నిజం, ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి లోని ప్రధాన రహదారి కూడలి వద్ద గల రిక్వెస్ట్ బస్ స్టాప్ నందు వెలుగు చూసిన దృశ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో మహిళలకు, థర్డ్ జెండర్ లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆయా చోట్ల మాత్రం మహిళలు బస్సులో స్థానం లేక ఇక్కట్లు పడుతున్నారు. సోమవారం కరీంనగర్ నుండి మంచిర్యాల వెలుస్తున్న బస్సు రాజారాంపల్లి రెక్వెస్ట్ బస్ స్టాప్ నందు కొందరు ప్రయాణికులు దిగే క్రమంలో ప్రయాణానికి సిద్దగా ఉన్న కొందరు మహిళలకు బస్సులో ప్రవేశించుటకు వెళ్లగా సదరు బస్సు కండక్టర్ బస్సులో స్థానం లేదని లోనికి అనుమతించలేదు. ఈ సందర్భంలో వృద్ద మహిళలు అతనిపై గొడవకు దిగారు మాకు చాలా తొందరగా వెళ్లవలసిన అవసరం ఉందని కండక్టర్ని కోరాగా బస్సులో స్థానం లేదు అనడంతో ఇరువురి మధ్య తేలికపాటి వాగ్వాదం నెలకొంది. ఇది గమనించిన బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా తీసుకువెళ్లాడు. దీనిపై ప్రయాణంలో ఇబ్బందికి గురైన మహిళలు ఉచిత పథకం వల్ల మహిళా ప్రయాణికులు పెరగడం పట్ల బస్సులో చోటు దొరకడం లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. కరీంనగర్ నుండి మంచిర్యాలకు బస్సులు తక్కువ ఉన్నందున ఇలాంటి అసౌకర్యం నెలకొంటుందని వారు వాపోయారు. ఇందుకుగాను మరిన్ని బస్సులు పెంచవలసిందిగా మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి విషయమై అధికారులు స్పందించి బస్సులు పెంచవలసిందిగా ప్రయాణికులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img