మంచు మోహన్ బాబు ఇంట్లో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. హీరో మంచు మనోజ్, మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. గతంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరిగిన ఫైట్ వీడియో కూడా వైరల్‌గా మారింది. తాజాగా మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు మనోజ్.. గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి తన తండ్రి మోహన్ బాబు కొట్టాడని, భార్యపై కూడా దాడి చేశాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనపై కూడా మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం. పాఠశాల, ఆస్తి విషయంలో వీరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. పరస్పర ఫిర్యాదులతో మంచు కుటుంబ కలహాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.