Homeఆంధ్రప్రదేశ్బెయిల్​ రద్దు పిటిషన్​పై కౌంటర్​ దాఖలు చేయండి

బెయిల్​ రద్దు పిటిషన్​పై కౌంటర్​ దాఖలు చేయండి

– చంద్రబాబుకు సూచించిన సుప్రీంకోర్టు
– ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని వెల్లడి

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్‌ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు తర్వాతే విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాలు ఎక్కడా మాట్లాడవద్దని చంద్రబాబుకు సూచించింది. అయితే, ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 20న ఇచ్చిన సాధారణ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. స్కిల్‌ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులను తెదేపా ఖాతాలకు మళ్లించారనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి బెయిల్‌ ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సీఐడీ ఈ నెల 21న సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది.

Recent

- Advertisment -spot_img