Homeహైదరాబాద్latest Newsజగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం వారిచే మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం వారిచే మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలంలోని మల్లన్నపేట్ గ్రామానికి చెందిన మున్నూరుకాపు నిరు పేద కుటుంబం లక్కకుల మల్లేష్ ఉపాధి నిమిత్తం ముంబైలో ఇటీవల గుండెపోటుతోమరణించడం జరిగింది. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో భార్య జమున ఇద్దరు చిన్న పిల్లలు పాప, బాబు కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. వీరి కుటుంబ పరిస్థితి కుల సంఘం నాయకులు భీమా సంతోష్,అనంతుల మహేష్,పడాల మల్లారెడ్డి, ద్వారా మున్నూరు కాపు జిల్లా సంఘం తెలియచేయగా స్పందించిన కుల బంధావులు పెద్దమనసుతో కొంత డబ్బులు సమకూర్చగా సేకరించిన డబ్బులు జగిత్యాల మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి కొంత అండగా నిలిచే విదంగా రూ:20,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ సందర్భంగా జగిత్యాల మున్నూరుకాపు జిల్లా అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ పిల్లల భవిషత్తు రీత్యా వారి విద్యా అబ్యాసం మరియు కుటుంబానికి అన్ని విధాలుగా మున్నూరు కాపు జిల్లా సంఘం తరుపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రాచకొండ శ్రీరాములు, బండారి విజయ్, లైశెట్టి వెంకన్న, చిట్ల అంజన్న, కొలగాని మధుసుదన్, జున్ను రాజేందర్, అయ్యోరి సుధాకర్, అత్తినేని శ్రీనివాస్,చీటీ లక్ష్మీనారాయణ, పెంచాల తిరుపతి, మున్నూరు కాపు గ్రామ అధ్యక్షుడు అవారి లచ్చన్న, సిద్దెంకి మల్లారెడ్డి, రమేష్, కల్లేం బాల్రెడ్డి, ముత్యాల మోహన్, అవారి శ్రీనివాస్, అనంతుల మహేష్, పడాల తిరుపతి, గంగారెడ్డి, మల్లారెడ్డి, రాము, శేంకర్, మల్లారెడ్డి, లక్కకుల రాజమల్లు, రవి, మహేష్, బీమ సత్తన్న, మున్నూరుకాపు కుల బంధావులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img