Homeహైదరాబాద్latest Newsఆదివాసి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం - Gudur

ఆదివాసి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం – Gudur

నేత్ర యూత్ బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో

ఇదే నిజం, గూడూరు : మ‌హ‌బూబాబాద్ జిల్లా, గూడూరు మండలం. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన నిరుపేద ఆదివాసీ కుటుంబానికి, నేత్ర‌ యూత్ అండ‌గా నిలిచింది. గ్రామానికి చెందిన పొడుగు సోమక్క అనారోగ్యంతో బాధ‌ప‌డుతుండ‌గా, ఆమె వైద్య ఖ‌ర్చుల‌క‌య్యే మొత్తాన్ని భ‌రించేందుకు నేత్ర యూత్ ముందుకు వ‌చ్చింది. ఇందులో భాగంగా స్వ‌యంగా యూత్ ఆర్థిక సాయం అందిస్తూనే, ప‌లువురి దాత‌ల స‌హ‌కారం కూడా తీసుకొని, సోమ‌క్క‌కు భ‌రోసా ఇచ్చి, ఆమె వైద్య ఖ‌ర్చుల మొత్తం 25వేల‌ రూపాయలను అందించారు. ఈ సంద‌ర్భంగా యూత్ నాయ‌కులు మాట్లాడుతూ, గ్రామంలో ఏ పేద కుటుంబానికి ఆప‌ద వ‌చ్చినా, తాము ఆదుకోవ‌డానికి ముందు వరుసలో ఉంటామన్నారు. అంతేగాకుండా పేద పిల్ల‌ల చ‌దువుల కోసం కూడా తాము అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకున్న నేత్ర యూత్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేత్ర యూత్ సభ్యులు బుడిగే సతీష్, భూపతి శ్రీను, మేరుగు మధు, మేరెడ్డి సుమన్, బొల్లి సార‌య్య‌, దోస‌పాటి మ‌హేష్‌, కారింగుల శ్రీ‌ను, దొణికెల న‌రేష్‌, పొడ‌కంటి కార్తీక్‌, క్రాంతి, ముల్క‌పురి సురేష్‌, పూనెం లోకేష్‌, ఈసం గ‌ణేష్‌, కొయ్య‌టి అనిల్‌, ముయబోయిన ప్రశాంత్, గ్రామ పెద్ద‌లు బత్తుల రామన్న, పూనెం యాక‌య్య‌, ధోనికెళ్ళ కుమార్ స్వామి, పబ్బోజు ఏకాచారి, హరికృష్ణ, మహమ్మద్ అలీ, దొణికెల ర‌మేష్‌, గుర్రం ప్రభాకర్, పూనెం మునేందర్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img