Homeసైన్స్​ & టెక్నాలజీKnow your Aadhaar Number : ఆధార్ నంబ‌ర్ మ‌ర్చిపోయారా ? ఇలా తెలుసుకోండి

Know your Aadhaar Number : ఆధార్ నంబ‌ర్ మ‌ర్చిపోయారా ? ఇలా తెలుసుకోండి

Find your Forgotten Aadhaar card number : ఆధార్ ఇప్పుడు అంత‌ట అవ‌స‌ర‌మే..  దాంతో ఎప్పుడు ఏ అవ‌స‌రం ప‌డుతుందో చెప్ప‌లేం.

అలా ఎప్పుడైనా ఆధార్‌తో ప‌నిప‌డ్డ‌ప్పుడు జేబులో ఆధార్ కార్డు ఉండ‌క‌పోవ‌చ్చు.

క‌నీసం ఆధార్ నంబ‌ర్ చెబుదామ‌న్నా నంబ‌ర్ గుర్తుండ‌దు. ఆ స‌మ‌యంలో ఏం చేయాలా? అని తెగ టెన్ష‌న్ ప‌డిపోతుంటాం.

కానీ అంత కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

మీ చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, అందులో ఇంట‌ర్నెట్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే ఆధార్ నంబ‌ర్‌ను తెలుసుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ నంబ‌ర్ మ‌ర్చిపోయారా ? ఇలా తెలుసుకోండి

  • ఆధార్ నంబ‌ర్ తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నంబ‌ర్ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆధార్ నంబ‌ర్ తెలుసుకోవ‌డం సాధ్య‌మ‌వుతుంది.
  • ముందుగా మీ బ్రౌజ‌ర్‌లో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి
  • యూఐడీఏఐ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక ‘మై ఆధార్’ సెక్ష‌న్‌లోని ‘ఆధార్ స‌ర్వీసెస్’‌లో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబ‌ర్‌(యూఐడీ) సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ త‌ర్వాత మొబైల్ నంబ‌ర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంట‌ర్ చేయాలి
  • అనంత‌రం క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి, Send OTP పై క్లిక్ చేయాలి
  • మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఆరు అంకెల ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి.
  • లాగిన్‌పై క్లిక్ చేయ‌గానే మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఆధార్ నంబర్ మెసేజ్ వ‌స్తుంది.

Recent

- Advertisment -spot_img