Homeహైదరాబాద్latest Newsకామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

ఇదేనిజం, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల ఇనుప సామాను దుకాణంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు ఉడ్చి చెత్తను పోగు చేసి పెట్టిన మంటతో ఇనుప సామాను దుకాణంలోకి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు.సంఘటన స్థలానికి మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అర్పేందకు శ్రమించారు. సుమారు నాలుగు గంటల పాటు దుకాణంలో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటను ఆర్పేందుకు ప్రయత్నించగా మంటలు అదుపులోకి వచ్చాయి.

Recent

- Advertisment -spot_img