Fire Accident: హైదరాబాద్‌లో ఈ మధ్య తరుచు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అంబర్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ సామగ్రి ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంగలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.