Homeహైదరాబాద్latest Newsకల్యాణ్ రామ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం

కల్యాణ్ రామ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్ని ప్రమాదం

టాలీవుడ్ హీరో నందమూరి కల్యాణ్ రామ్, చిలుకూరి ప్రదీప్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో అపశ్రుతి జరిగింది. షూటింగ్ కోసం వేసిన ఓ సెట్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో దాదాపు రూ. 4 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. 10 రోజుల షూటింగ్ కోసం వేసిన ఈ సెట్‌లొో 9 రోజులు సజావుగా జరగ్గా..చివరిరోజు అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు కొనసాగించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమాలో తెలుగు నటి విజయశాంతి ప్రముఖ పాత్రలో నటిస్తోంది.

Recent

- Advertisment -spot_img