Homeక్రైంVizag​ ఫిషింగ్ హర్బర్​లో అగ్ని ప్రమాదం

Vizag​ ఫిషింగ్ హర్బర్​లో అగ్ని ప్రమాదం

– 40 బోట్లు దగ్ధం

ఇదే నిజం, ఏపీ బ్యూరో: వైజాగ్​లోని ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. వీటి విలువ రూ.40-50లక్షలు ఉంటుందని పేర్కొంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఇలా చేసి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో బాధిత కుటుంబసభ్యులు బోరున విలపించారు.


మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి


విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బోట్ల యజమానులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టి భద్రతాపరమైన అంశాలపై సమీక్షించాలని కోరారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని పవన్‌ సూచించారు

Recent

- Advertisment -spot_img