Homeహైదరాబాద్latest Newsమియాపూర్‌లో అగ్ని ప్రమాదం

మియాపూర్‌లో అగ్ని ప్రమాదం

Hyderabad : హైదరాబాద్ మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ పార్కింగ్ పక్కన చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. అనంతరం ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా ఈ ఘటనలో ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img