పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న ‘ఉస్తాద్.. భగత్ సింగ్’మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 3 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో ఓ వీడియో గ్లింప్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. నిమిషం నిడివితో ఉన్న ఈ వీడియోలో పవన్ ఫుల్ యాక్షన్ మోడ్‌లోనే కనిపించారు. వందలాది మంది జనం మధ్య నుంచి కారులో ఆయన ఎంట్రీ ఇచ్చిన తీరు.. జాతర మధ్యలో ఫైట్ సీన్లు ఆయన ఫ్యాన్స్ మంచి ట్రీట్‌ను ఇచ్చాయనే చెప్పాలి. ‘గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది’,‘గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం’అంటూ అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.