Homeహైదరాబాద్చేప పిల్లలు పంపిణీ చేసిన జిల్లా మత్స్య శాఖ అధికారి

చేప పిల్లలు పంపిణీ చేసిన జిల్లా మత్స్య శాఖ అధికారి

మేడ్చల్ పట్టణం లోని చేప పిల్లల కేంద్రంలో శుక్రవారం మత్స్య శాఖ జిల్లా అధికారి నరసింహ రావు ఆధ్వర్యంలో తూముకుంట మున్సిపాలిటీ లోని దేవరయాంజల్, మూడు చింతల పల్లి మండలంలోని లక్ష్మపూర్, కొల్తుర్, కీసర మండలంలోని యాద్గర్ పల్లి, దుండిగల్ మండలంలోని బహదూర్ పల్లి, డి.పోచంపల్లి గ్రామాలలోని సంఘాలకు బొత్స, రొవ్వు, బంగారు తీగ మూడు రకాల చేపలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడుతూ జిల్లాలోని 388 చెరువులకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100 శాతం సబ్సిడీ పై పంపిణీ చేస్తున్నమన్నారు.దానిలో భాగంగానే శుక్రవారం 8 సంఘాలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img