జూన్ 8న ప్రధానిగా మూడో సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్తవ్య పథ్‌లో మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు అందరూ హాజరుకానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్డీయే కూటమి సమావేశం అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో లోక్‌సభ ఎన్నికల కదనరంగంలోకి దిగిన బీజేపీ.. ఆ లక్ష్యం చేరుకోవడంలో విఫలమయ్యింది. సొంతంగా కనీస మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. ఒక వర్గాన్ని ఆకర్షించి వారి ఓట్లు గంపగుత్తగా రాబట్టేందుకు స్థాయి దిగజారి చేసిన ఎన్నికల ప్రచారం కారణాలుగా చెబుతున్నారు. ఇక తీవ్రరూపం దాల్చిన నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్భణం, ఫిరాయింపులకు ప్రోత్సాహం వంటివి బీజేపీని దెబ్బతీశాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.