HomeSocial MediaNGKL: జిల్లాలో ఫ్లెక్సీలను చింపివేశారు..

NGKL: జిల్లాలో ఫ్లెక్సీలను చింపివేశారు..

ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండల కేంద్రంలో ఫ్లెక్సీల చింపివేత కలకలం సృష్టించింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పండుగ శుభాకాంక్షలు తెలిపిన BRS నాయకుల ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. ఫ్లెక్సీలు చింపి వేసిన సంఘటనపై స్థానిక నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌లలో ఫ్లెక్సీలు చింపి వేసిన వారిని గుర్తించడం సాధ్యమవుతుందని ఆ దిశగా పోలీసులు పరిశీలన చేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img