Homeఫ్లాష్ ఫ్లాష్Food For Brain Health : ఈ ఫుడ్​ తింటే మెదడుకు సమస్యలే

Food For Brain Health : ఈ ఫుడ్​ తింటే మెదడుకు సమస్యలే

Food For Brain Health : ఈ ఫుడ్​ తింటే మెదడుకు సమస్యలే

Food For Brain Health : నలుగురితో మాట్లాడే సమయంలో కొందరు ఒక్కోసారి తీవ్ర భావోద్వేగానికి గురవుతుంటారు.

ఆగ్రహంతో ఊగిపోతుంటారు. తట్టుకోలేని ఆవేశంలో పెద్దపెద్దగా అరుస్తూ కిందా మీదవుతుంటారు.

మన చట్ట సభల్లో చూడండి. చర్చల సమయంలో రాజకీయ నాయకులు రెచ్చిపోతుంటారు.

ఇక మన సైంటిస్టులకు కొందరు వీరావేశంతో బెదిరింపు ఈ-మెయిళ్లు పంపుతుంటారు.

ట్విటర్‌లాంటి వాటిని హ్యాక్ చేసి, తమ కోపాన్ని తీర్చుకుంటుంటారు.

ఏదో అసహనం. ఒక్కసారిగా ఎదుటివారి మీదనో, ప్రత్యర్ధుల మీదనో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతుంటుంది. విరుచుకుపడుతుంటారు.

వ్యాయామానికి ముందు ఒక కప్పు కాఫీతో తేడా…

కొందరు మనుషుల్లోనే ఎందుకిలా జరుగుతోంది ? ఇలా కోపం, ఆవేశంతో ఊగిపోవడానికి సోషల్ మీడియాలో చర్చలు కూడా ఓ కారణమని కొందరు అంటుంటారు.

కానీ, ఇదికాక ఇంకేదైనా ఉందా? మన కమ్యూనికేషన్ స్టైల్ పై ఇంకేదైనా ప్రభావం చూపిస్తోందా?

‘ది బెటర్ బ్రెయిన్’ రచయితలుగా, పోషకాహారం, మానసిక ఆరోగ్యాలపై పరిశోధన చేసిన వారిగా మేం కొన్ని విషయాలను గుర్తించాం.

మన సమాజంలో చాలామంది మెదళ్లు ఆకలితో బాధపడుతున్నాయి.

అది వారి మానసిక స్థితి మీద ప్రభావం చూపుతోంది. తమకు తెలియకుండానే ఎమోషన్‌కు లోనవుతున్నారని మా పరిశీలనలో తేలింది.

ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

సహజంగానే, మనకు స్థూల పోషకాల లోటు లేదు. అమెరికన్‌లు తగినంత ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్‌లు ఆహారంలో తీసుకుంటారు.

కానీ, చాలామందికి సూక్ష్మపోషకాలు మాత్రం తగినంతగా అందడం లేదు.

ముఖ్యంగా అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ మన ఆహారపు అలవాట్లపై ఆధిపత్యం చెలాయిస్తోంది.

మనిషి మెదడుకు కావాల్సిన సూక్ష్మపోషకాలు అందక పోవడానికి ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటమే కారణమని అనేక అధ్యయనాలలో తేలింది.

ఢాకా బనానా తింటే ఉండ‌దు జీవితానికి ఢోకా

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఏమిటి? (Food For Brain Health)

చాలా మంది ఎంతో ఇష్టంగా తినే కేక్స్, చికెన్ నగ్గెట్స్, పెద్ద మొత్తంలో తయారు చేసి, ప్యాకెట్లలో నిలువ ఉంచిన బ్రెడ్స్, బన్నులను అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారంగా పరిగణిస్తున్నారు. మరింత వివరంగా చెప్పాలంటే..

  • తియ్యగా, రుచికరంగా ఉంటూ ప్యాకెట్లలో నిల్వచేసిన స్నాక్స్, కరకరలాడే పదార్థాలు.
  • చాకొలెట్ బార్స్, స్వీట్లు.
  • సోడా, తియ్యటి పానీయాలు.
  • ప్యాకెట్లలో నిల్వ ఉంచిన చికెన్, మటన్, ఫిష్ నగ్గెట్స్.
  • చిటికెలో తయారయ్యే నూడుల్స్, సూప్స్.
  • ప్యాకెట్లలో నిల్వ చేసిన రెడీమెడ్‌ భోజనం.
  • నూనె, చక్కెర, కొవ్వు పదార్థాలతో తయారు చేసిన ఆహారం.
  • పెద్ద మొత్తంలో తయారు చేసి, ప్యాకెట్లలో నిల్వ ఉంచిన బ్రెడ్స్.

సాధారణంగా, వీటిలో అతి తక్కువ మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉంటాయి.

2004లో కెనడియన్ కమ్యూనిటీ హెల్త్ సర్వే, 2018లో అమెరికాకు చెందిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనాలిసిస్ సర్వే ప్రచురించిన మూడు విశ్లేషణలు భయంకరమైన నిజాలను వెల్లడించాయి.

మీరు తింటున్న‌ కోడిగుడ్డు ఆరోగ్యకరమైనదేనా..

2004లో కెనడాలోని అన్ని వయసుల వారిలో 40% కేలరీలు అల్ట్రా-ప్రాసెస్డ్ ఉత్పత్తులవేనని తేలింది.

2018లో అమెరికాలో 2-19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు వినియోగించే వాటిలో 67%, పెద్దలు వినియోగించే వాటిలో 57% అల్ట్రా-ప్రాసెస్డ్ ఉత్పత్తులే ఉన్నాయి.

చాలామందిలో శారీరక ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం ఆహారమే.

నాణ్యత లేని ఆహారం కారణంగా ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధ వ్యాధుల వంటి దీర్ఘకాలిక సమస్యలు దాడి చేసే ప్రమాదం ఉంది.

అలాగే మానసిక ఆరోగ్యంలోనూ ఆహారం కీలక పాత్ర పోషిస్తోంది.

మొలకలు తింటే ఆరోగ్యానికి వ‌చ్చే మేలు ఏంటి..

మానసిక ఆరోగ్యం పై సూక్ష్మ పోషకాల ప్రభావం ఏంటి?

ప్రస్తుత కాలంలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ మీద ప్రజలకు మోజు పెరిగింది. ఇందులో సూక్ష్మ పోషకాల లేమి ప్రభావం మన మెదళ్ల పై పడుతోందట.

ముఖ్యంగా చిరాకు, కోపం, చంచలమైన మానసిక స్థితి లాంటివి దీనివల్లే ఏర్పడుతున్నట్లు శాస్త్రీయ ఆధారాలున్నాయి.

అయితే, మీడియాలో వీటి గురించి ఎక్కువగా చెప్పరు.

కెనడా, స్పెయిన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో జరిగిన డజనుకు పైగా అధ్యయనాలు, పూర్తి సమతుల ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వారిలో యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

దీంతో వారంలో జుట్టు రాలే సమస్యకు చెక్‌

అయితే, మానసిక సమస్యలకు పోషకాహారమే కారణమని అన్ని అధ్యయనాలు నిరూపించలేవు.

అందుకే కొందరు వ్యక్తులను ఎంచుకుని శాస్త్రవేత్తలు వారిపై ప్రయోగాలు చేశారు.

ఈ అధ్యయనాలలో పాల్గొనే వారిలో ఎలాంటి మానసిక సమస్యలు లేనివారిని ఎంచుకున్నారు.

కొన్నాళ్ల తర్వాత వారి ఆహారపు అలవాట్లు, మానసిక ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు.

ఇందులో కొన్ని ఫలితాలు ఆశ్చర్యపరిచాయి.

జపాన్‌లో 10-15 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు 89,000 మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో, సంపూర్ణ ఆహారాన్ని తినేవారిలో ఆత్మహత్యల రేటు, తక్కువ ఆరోగ్యకరమైన ఆహారాలు తినేవారి ఆత్మహత్యల రేటులో సగం ఉంది.

తినేప్పుడు పచ్చిమిర్చి ఏరేస్తున్నారా..

ఇక్కడ కెనడాలో 10, 11 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో వారికి అందుతున్న ఆహారం, చేస్తున్నఎక్సర్‌సైజ్, స్క్రీన్‌ టైమ్ (కంప్యూటర్ ముందు ఎంతసేపు కూర్చుంటున్నారో తెలిపేది) వంటి వాటి ఆధారంగా వారిలో రాబోయే రెండు సంవత్సరాలలో మానసిక సమస్యలకు లోనయ్యేవారిని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

పిల్లలకు పోషకాహారం ఇవ్వడమనేది ప్రాధామ్యంగా ఉండాలని ఈ పరిశోధన స్పష్టం చేసినట్లయింది.

చిరాకు, తరచూ మారే మానసిక స్థితి, డిప్రెషన్‌తో బాధపడే వారిని, పెద్దగా పోషకాలు లేని ఆహారం నుంచి మెడిటెరేనియన్ ఆహారం వైపు మరల్చినప్పుడు, వారి మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించిందని అనేక అధ్యయనాలలో తేలింది.

మనం ఏం చేయాలి? (Food For Brain Health)

మెడిటెరేనియన్ ఆహారం అంటే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు, చిక్కుళ్లు, షెల్ఫిష్, ఆలివ్ ఆయిల్ వంటి అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం.

ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు, గుండె ప‌దిలం

మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిపై జరిగిన ఒక అధ్యయనంలో సాధారణ చికిత్సతోపాటు, మంచి ఆహారపు అలవాట్లను అనుసరించడం ద్వారా మూడింట ఒక వంతుమంది 12 వారాల తర్వాత డిప్రెషన్ నుంచి కోలుకున్నట్లు గుర్తించారు.

మెదడులో జరిగే జీవక్రియలకు సపోర్ట్ ఇవ్వడానికీ, సెరోటోనిన్, డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్‌ల ఉత్పత్తిని నిర్ధారించడానికి, అలాగే జీవక్రియ వల్ల ఏర్పడ ఉప ఉత్పత్తులను ధ్వంసం చేసి బయటకు పంపడానికి మెదడుకు కనీసం 30 రకాల సూక్ష్మపోషకాలు అవసరముందని సైన్స్ చెబుతోంది.

సాధారణ చికిత్సలతో పాటు పోషకాహారం ద్వారా జరిపే ట్రీట్‌మెంట్ వల్ల మానసిక స్థితి అదుపులో ఉండటం, చిరాకు, ఆవేశం లాంటివి తగ్గిపోవడం గుర్తించారు.

వీటితోపాటు పిల్లల్లో కనిపించే హైపర్ యాక్టివిటీ డిజార్డర్, అటెన్షన్ డెఫిసిట్ (ఏకాగ్రతాలోపం), మూడ్ డిస్‌రెగ్యులేషన్ లాంటి వాటిలో కూడా మార్పులు ఉన్నట్లు గుర్తించారు.

ఉదయం ఇవి తింటే ఇక ఆరోగ్యం మీ చేతుల్లోనే

దీనిని బట్టి తేలిందేమిటంటే, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల మనిషి మానసిక ఒత్తిడిని తట్టుకోగలడు. పైకి కనిపించని బ్రెయిన్ హంగర్ (మెదడు ఆకలి) అనేది మనిషిలోని భావోద్వేగాలను, ఆవేశాన్ని, దూకుడు స్వభావాలకు కారణమవుతుంది. దానిని మంచి పోషకాహరంతో సరి చేసుకోవచ్చు.

(బోనీ కప్లాన్ యూనివర్శిటీ ఆఫ్ కాల్గరీ కమ్మింగ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ ఎమెరిటస్, జూలియా జె. రక్లిడ్జ్ కాంటర్‌బరీ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్.

ఈ వ్యాసం ‘ది కన్వర్సేషన్’ లో ప్రచురితమైంది.

Recent

- Advertisment -spot_img