Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ

గుడ్ న్యూస్.. మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ

– మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నీరటి రాజేశ్వరి

ఇదేనిజం, లక్షెట్టిపేట: మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి (బాలికలు), చెన్నూరు (బాలురు)లలో 5వ తరగతిలో నూతన అడ్మిషన్లు, 6, 7, 8 తరగతులలో ఖాళీగా ఉన్న మైనారిటీ సీట్ల భర్తీ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నూతన అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అవకాశం కల్పిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

అర్హులైన మైనారిటీ (ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు) దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు దారులకు గ్రామీణ ప్రాంతాలలో రూ. లక్షా 50 వేలు, పట్టణప్రాంతాల్లో రూ. 2 లక్షలకు మించి ఆదాయం ఉండొద్దని చెప్పారు.

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్

ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 18వ తేదీ నుండి ఫిబ్రవరి 6వ తేదీ లోగా ఆన్ లైన్ లో http:/tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కొరకు మీ సేవ కేంద్రాలు, మైనారిటీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

Recent

- Advertisment -spot_img