‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి హిట్ సినిమాలతో ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సూపర్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్‌గా ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయినిగా ప్రముఖ హీరోయిన్లు కియారా అద్వానీ, నేషనల్ క్రష్ రష్మిక మందాన పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఒకటి కాదు, మూడు డిఫరెంట్ లుక్‌లలో కనిపించనున్నాడు అని టాక్, ఇది అతని అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఒక పాత్రలో పోలీసుగాను.. మరో పాత్రలో గ్యాంగ్ స్టార్ గా… మూడో లుక్ మాత్రం తండ్రి పాత్రలో కనిపిస్తాడు అని తెలుస్తుంది. ప్రభాస్ గాని సినిమాలో ఈ మూడు లుక్స్ తో కనిపిస్తే మాత్రం ఇంకా ఆ దెబ్బతో ఇండియా మొత్తం షేక్ అవ్వాల్సిందే.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో టి-సిరీస్‌కి చెందిన భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.