Homeహైదరాబాద్latest Newsఅమ్మ ప్రేమ మరిచి.. అంత్యక్రియలకు అడ్డుపడి..

అమ్మ ప్రేమ మరిచి.. అంత్యక్రియలకు అడ్డుపడి..

– ఆస్తి పంపకాల్లో గొడవలు
– తల్లికి దహన సంస్కారాలు కొడుకులు, కూతుళ్లు
– రెండ్రోజులుగా ఇంట్లోనే భౌతిక కాయం
– సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో అనాగరిక చర్య


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: అమ్మను మించిన దైవం లేదంటారు. ఎన్ని జన్మలెత్తినా తల్లి రుణం తీర్చుకోలేనిది. అలాంటి అమ్మ మృతదేహాన్ని పక్కనపెట్టుకొని ఆస్తి కోసం కొట్టాడారు కొడుకులు, బిడ్డలు. ఆస్తి తగాదాలు కొలిక్కి రాకపోవడంతో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించకుండా రెండ్రోజులుగా భౌతికకాయాన్ని ఇంట్లోనే ఉంచారు. ఈ అనారిక చర్య సూర్యాపేట జిల్లా కందులవారి గూడెంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వేము లక్ష్మమ్మ (80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమె వద్ద రూ.21 లక్షల విలువైన ఆస్తి,20 తులాల బంగారం ఉన్నాయి. ఒక కుమారుడు ఇదివరకే మరణించాడు. తల్లి మరణవార్త తెలుసుకున్న కుమార్తెలు, కోడలు, మరో కుమారుడు కందులవారి గూడెం చేరుకున్నారు. అంత్యక్రియల విషయం ఆలోచించకుండా ఆస్తి కోసం గొడవ పడ్డారు. గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టుకున్నారు. రెండ్రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది తప్ప.. పరిష్కారం రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. కన్నబిడ్డలే దహనసంస్కారాలు చేయకుండా ఆలస్యం చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

Also Read : Shocking: అసలు వీళ్ళు డాక్టర్లేనా.. చిన్నారి చేతి వెలికి బదులు నాలుకకు సర్జరీ చేశారు..!

Recent

- Advertisment -spot_img