Homeహైదరాబాద్latest Newsమాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి హైకోర్టులో ఊరట

బోధ్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్‌పై రెండు వారాల పాటు కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రగతి భవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో రహీల్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 8న రహీల్‌ను దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా.. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు.

Recent

- Advertisment -spot_img