Homeహైదరాబాద్latest Newsపరేషాన్ లో మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు

పరేషాన్ లో మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు

  • గత ప్రభుత్వం లో చేసినా పనులకు బిల్లులు రాక అవస్థలు
  • పదవీ బాధ్యతలు ముగిసిన తరువాత పట్టించుకొనే వారు లేక ఇబ్బందులు
  • కొన్ని గ్రామాల సర్పంచులు బిల్లులు రాక ఆత్మ హత్యలు చేసుకున్న వైనం

ఇదే నిజం, జగిత్యాల టౌన్ : గత ప్రభుత్వం లో సర్పంచులు, ఎంపీటీసీలు గా పనిచేసిన నాయకులకూ బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు. గ్రామ అభివృద్దికి కృషి చేసిన సర్పంచ్ లను ఎవరూ పట్టించుకోవడం లేదు. పార్టీ మారితే గానీ టేబుల్ పై ఫైల్స్ జరుగవు అని కొన్ని గ్రామాలలో మాజీ సర్పంచ్ లకు ఫోన్ కాల్స్. సీసీ రోడ్డు పనుల బిల్లులు, డ్రైనేజీ, శ్శాశాన వాటిక.. ఇలా చెప్పుకుంటూ పొతే గ్రామాలలో చేసిన పనులకు పైసలు రాక మాజీ సర్పంచ్ లు ఎంపీటీసీ లకు పెద్ద తల నొప్పిగా మారింది. ఇంకా ఆత్మహత్యలు జరగకుండా ఉండాాలంటే ప్రభుత్వం త్వరగా స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img