వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ గుంటూరు జైలులో ఉన్నారు. అయితే తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఛాతి, భుజం నొప్పి రావడంతో జైలు అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కాగా, అరెస్టు సమయంలో సురేష్ తన భుజం నొప్పిగా ఉందని జైలు అధికారులకు చెప్పాడు. చంద్రబాబు ఇంటిపై దాడితో పాటు మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ప్రస్తుతం నిందితుడుగా ఉన్నాడు. కోర్టు రిమాండ్ విధించడంతో గుంటూరు జైలుకు తరలించారు. అక్కడ అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.