Homeక్రైంFraud:కరెంట్ బిల్లుల పేరుతో ఖాతాలు ఖాళీ

Fraud:కరెంట్ బిల్లుల పేరుతో ఖాతాలు ఖాళీ

Fraud:మీరు కరెంట్‌ బిల్లు కట్టలేదా? అయితే, బిల్లు కట్టాలంటూ ఎవరైనా ఫోన్‌ చేస్తే నమ్మకండి. పొరపాటున నమ్మారో అంతే సంగతులు! మీ అకౌంట్లో డబ్బు మొత్తం గల్లంతవడం ఖాయం. 

సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నారు. సరికొత్త మోసాలకు తెరలేపుతూ కోట్ల రూపాయులు కొట్టేస్తున్నారు. ఒక మోసం బయటపడి ప్రజల్లో అవగాహన వచ్చిందనుకునేలోపే మరో మార్గాన్ని ఎంచుకుంటున్నారు సైబర్‌ చీటర్స్‌. అలాంటి కొత్త తరహా మోసమే ఒకటి కామారెడ్డి జిల్లాలో బయటపడింది. కరెంట్‌ బిల్లు పేరిట టోకరా వేశారు సైబర్‌ నేరగాళ్లు. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామస్తుడైన రాజేశ్వర్‌కు ఫోన్‌చేసిన కేటుగాళ్లు.. మూడు నెలల కరెంట్‌ బిల్లు పెండింగ్‌ ఉందంటూ బెదిరించారు. వెంటనే చెల్లించకపోతే కరెంట్ కట్‌ చేస్తామంటూ దమ్కీ ఇచ్చారు.

ఓ లింక్‌ పంపి ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించాలని చెప్పడంతో దాన్ని ఓపెన్‌ చేశాడు రాజేశ్వర్‌. అంతే, అకౌంట్‌లో నుంచి 49వేల రూపాయలు డెబిట్‌ అయినట్టు మొబైల్‌కి మెసేజ్‌ ఇచ్చింది. దాంతో, మోసపోయాయని గ్రహించిన బాధితుడు రాజేశ్వర్‌.. దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్‌ చేశాడు.

సైబర్‌ నేరాలపై ఎప్పటికప్పుడు అవేర్‌నెస్ కల్పిస్తున్నా చీటర్స్‌ కూడా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలాంటిదే ఇది. కరెంట్ బిల్లు కట్టకపోతే సాధారణంగా విద్యుత్‌ సిబ్బంది ఫోన్‌ చేయనే చేయరు. ఇంటికే వచ్చి అడగడమో, స్థానిక లైన్‌మెనో వస్తాడు. ఒకవేళ ఎవరైనా ఫోన్‌ చేశారంటే మోసగాళ్లే అయ్యుంటారు. ఈమాత్రం అవగాహన లేకపోతే మాత్రం ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల బారినపడటం ఖాయం. కరెంట్‌ కట్టాలనో, ఆధార్‌ కార్డు లింక్‌ చేయాలో ఎవరైనా ఫోన్‌చేస్తే మాత్రం అనుమానించాల్సిందే.

Recent

- Advertisment -spot_img