కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అర్హతలుండి అవకాశాలు లేక కొందరు, అర్హతలు, నైపుణ్యాలు లేక మరికొందరు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
అలాంటి వారికి మైక్రోసాఫ్ట్, ప్రొఫెషనల్ సోషల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్‌లు తమ వంతు సాయం చేస్తున్నాయి.
మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న 10 ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాలను ఉచితంగా నేర్పిస్తున్నాయి. ఇందుకోసం ఆన్‌లైన్ శిక్షణా ప్రాజెక్టును ప్రారంభించాయి.
ఎకనమిక్ గ్రాఫ్ అనే సాఫ్ట్‌వేర్‌తో అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలను, వాటికి కావాల్సిన నైపుణ్యాలను గుర్తించి, అందుకు తగ్గట్టుగా కోర్సులను రూపొందించామని ఉచిత ఆన్‌లైన్ శిక్షణా ప్రాజెక్టును ప్రారంభిస్తూ మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ వెల్లడించారు.
అత్యధిక అవకాశాలు, స్థిరమైన వృద్ధి, జీవన భృతి, కావాల్సిన నైపుణ్యాలను ఇంట్లోనే కూర్చొని నేర్చుకునే అవకాశం ఆధారంగా ఈ 10 ఉద్యోగాలను ఎంపిక చేశారు.
1) సాఫ్ట్‌వేర్ డెవలపర్
ఈ కోర్సులో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా విధులు నిర్వర్తించడానికి అవసరమైన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను నేర్పిస్తారు.
వెబ్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటాబేస్ నిర్వహణతోపాటు ఈ నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాలు, సంస్థల సమగ్ర సమాచారాన్ని అందిస్తారు.
ఈ కోర్సులో భాగంగా జావా స్క్రిప్ట్, జావా, ఎస్‌క్యూఎల్, హెచ్‌టీఎమ్‌ఎల్, సీఎస్‌ఎస్, పైథాన్ గురించి నేర్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2) సేల్స్ రిప్రెజెంటేటివ్
ఎకనమిక్ గ్రాఫ్ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు డిమాండ్ అధికంగా ఉన్న మరో ఉద్యోగం సేల్స్ రిప్రెజెంటేటివ్. ఈ కోర్సులో ఈ ఉద్యోగానికి కావాల్సిన ప్రాథమిక అంశాలు ఉంటాయి.
కస్టమర్లతో మాట్లాడే నైపుణ్యం, అమ్మకం వ్యూహాలు, ప్రొడక్ట్ గురించి వివరించే విధానం, నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కస్టమర్లతో రిలేషన్‌షిప్ ఎలా పెంపొందించుకోవాలనే అంశాలపై ఈ కోర్సులో శిక్షణ ఇస్తారు.
ఈ కోర్సును ఏడున్నర గంటల్లో పూర్తి చేయొచ్చు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) ప్రాజెక్టు మేనేజర్
లింక్ట్‌ఇన్ ప్రకారం ప్రాజెక్టు మేనేజర్లు ‘మార్పుకు ఉత్ప్రేరకాలు’
ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రాజెక్టులను ఎలా ముందుండి నడిపించాలనే అంశాన్ని మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లను ఉపయోగించి శిక్షణ ఇస్తారు.
అందుబాటులో ఉన్న వనరులతో బడ్జెట్‌కు తగ్గట్టు అనుకున్న సమయంలోనే ఒక ప్రాజెక్టును ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో నేర్పిస్తారు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మేనేజర్
ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ సాఫ్ట్‌వేర్‌ను నిర్వహించడానికి కావాల్సిన టూల్స్ గురించి ఈ కోర్సులో నేర్పిస్తారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్ సర్వర్ ప్రోగ్రామ్‌పై శిక్షణ ఇస్తారు.
ఈ కోర్సులో మొత్తం 8 మాడ్యుల్‌లు ఉంటాయి. ఇవి టీసీపీ/ఐపీ మోడల్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆధారపడి ఉంటాయి. కంపెనీలోని నెట్‌వర్క్‌ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో ఈ కోర్సులో నేర్చుకోవచ్చు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్
తొమ్మిది గంటల కోర్సులో కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇస్తారు. ఆగ్రహంతో ఉన్న వారితోనూ ఎలా మెలగాలో నేర్పిస్తారు.
వినడం, కస్టమర్లతో సఖ్యత ఏర్పరచుకోవడంతోపాటూ క్లిష్ట సమయాల్లో అనుసరించిన వ్యూహాలను వివరిస్తారు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్
కంపెనీల అంతర్గత వ్యవహారాల్లో అత్యంత ముఖ్యమైన ఉద్యోగాలలో ఇది ఒకటి.
ఈ కోర్సులో రెండు అంశాలుంటాయి. ఒకటి సంస్థలో థియరిటికల్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడం. రెండోది ప్రాక్టికల్ టూల్స్. విండోస్ 10తో మొదలుపెట్టి వాటిని అమలు చేయడం.
ఐటి సపోర్ట్, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టలేషన్, కంప్యూటర్లలో ఎదురయ్యే సమస్యలను గుర్తించేలా ఈ కోర్సులో అవగాహన కల్పిస్తారు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7) డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్
ఇంటర్నెట్ ప్రపంచంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఉద్యోగాల్లో ఇది ఒకటి.మార్కెటింగ్ ప్రణాళికలు, కంటెంట్ వ్యూహాలను ఈ కోర్సులో నేర్పిస్తారు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ – ఎస్ఈవో, గూగుల్ అనాలిటిక్స్ గురించి చెబుతారు.
అలాగే సెర్చ్‌లో బ్రాండ్ పొజిషనింగ్ గురించి కూడా వివరిస్తారు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
8) డేటా అనలిస్ట్
ఇది 30 గంటల కోర్సు. డేటా విశ్లేషణ ద్వారా వ్యాపార వ్యూహాలు, ఐడియాలను ఎలా అభివృద్ధి చేయాలో నేర్పిస్తారు.
అయితే ఈ కోర్సు నేర్చుకోవడానికి గణితం, స్టాటిస్టిక్స్, కమ్యునికేషన్స్, డేటా విజువలైజేషన్ టూల్స్‌పై ప్రాథమిక అవగాహన ఉండాలి.ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
9) ఫైనాన్షియల్ అనలిస్ట్
ఇది 27 గంటల కోర్సు.
ఆర్థిక, వాణిజ్య డేటాను విశ్లేషించి మార్కెట్ పోకడలను గుర్తించడానికి అవసరమైన అంశాలను ఈ కోర్సులో నేర్పిస్తారు.
తద్వారా ప్రాథమిక స్థాయిలో వ్యాపార, పెట్టుబడి సిఫార్సులను రూపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది.ఆర్థిక నివేదికలు, ఆర్థిక డేటా, విశ్లేషణాత్మక ఫైనాల్షియల్ సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి వాడే సాంకేతిక పరిజ్ఞానాలను ఈ కోర్సు ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
10) గ్రాఫిక్ డిజైనర్
ఇది 40 గంటల కోర్సు. ఇందులో గ్రాఫిక్ డిజైన్‌కు అవసరమైన ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. టైపోగ్రఫి, కలర్, ప్రజెంటేషన్ వంటి వాటి గురించి నేర్పిస్తారు.
ఈ కోర్సు పూర్తి చేస్తే ఇన్‌డిజైన్, ఇల్లస్ట్రేటర్, ఫోటొషాప్‌వంటి వాటిపై ఈజీగా పని చేయవచ్చు.
ఈ కోర్సుకు సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.