Homeసైన్స్​ & టెక్నాలజీFree Live channels Google TV : అదనపు చార్జీలు లేకుండానే గూగుల్ టీవీలో ఫ్రీగా...

Free Live channels Google TV : అదనపు చార్జీలు లేకుండానే గూగుల్ టీవీలో ఫ్రీగా లైవ్ టీవీ చానెల్స్‌

Free Live channels in Google TV without subscriptions : ఇంట్లో స్మార్ట్ టీవీ ఉందంటే.. ఇక ప్ర‌పంచ‌మంతా గుప్పిట్లో ఉన్న‌ట్టే.

ఏ సినిమా కావాలంటే ఆ సినిమాను చిటికెలో స్మార్ట్‌ఫోన్‌లో ఓపెన్ చేసుకొని చూసేయ‌చ్చు.

ఇక‌.. గూగుల్ టీవీని స‌పోర్ట్ చేసే స్మార్ట్ టీవీ ఉంటే ఇక ఫుల్ టు ఎంట‌ర్‌టైన్‌మెంటే.

గూగుల్ టీవీ అంటే ఆండ్రాయిడ్ ఆధారంగా న‌డిచే స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్ అని తెలుసు క‌దా.

క్రోమ్‌క్యాస్ట్ ఉన్నా కూడా.. దాని ద్వారా గూగుల్ టీవీని స్మార్ట్ టీవీలో క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు.

సోనీ, టీసీఎల్ లాంటి స్మార్ట్ టీవీ మోడ‌ల్స్‌లో గూగుల్ టీవీ డీఫాల్ట్‌గా ఉంటుంది.

స్మార్ట్ టీవీలో గూగుల్ టీవీ ఫీచ‌ర్ ఉందంటే.. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి యాప్స్ టీవీలో ఉంటాయి.

అయితే.. హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్ లాంటి యాప్స్‌కు లాగిన్ అవ్వాలంటే.. వాటికి స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాలి.

అలా కాకుండా.. ఫ్రీగా లైవ్ చానెల్స్‌ను గూగుల్ టీవీలో యాడ్ చేసేందుకు గూగుల్ క‌స‌రత్తు చేస్తోంది.

దీని కోస‌మే.. గూగుల్ ప్ర‌స్తుతం ఆయా కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది.

ఒక‌వేళ ఆ చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయితే.. గూగుల్ టీవీలో ఉచితంగా లైవ్ టీవీ చానెల్స్‌తో పాటు.. యాడ్ స‌పోర్ట్ టీవీ చానెల్స్‌ను చూడొచ్చు.

2022 లోపు గూగుల్ టీవీ ఫీచ‌ర్ ఉన్న స్మార్ట్ టీవీల‌లో ఉచితంగా టీవీ చానెల్స్‌ను స్ట్రీమింగ్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

క్రోమ్‌కాస్ట్ ఉన్న యూజ‌ర్లు.. లైవ్ టీవీ మెను ద్వారా.. న‌చ్చిన చానెల్‌ను బ్రౌజ్ చేసుకోవ‌చ్చు.

ప్ర‌స్తుతం ఈ మెనులో పెయిడ్ టీవీ స‌ర్వీసెస్ మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img