సింగిల్ స్క్రీన్ థియేటర్ కింద రిజిస్టర్ చేసుకుని, మల్టిపుల్ స్క్రీన్ నడిపిస్తున్నట్లు తెలుస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. తనిఖీలలో నిబంధనలను పాటించని మాల్స్‌కు, మల్టీప్లెక్స్‌లకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులు జారీ అయ్యాయి. మాల్స్, థియేటర్స్, మల్టీ ప్లెక్స్‌లలో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు. కూకట్ పల్లి, RTC క్రాసురోడ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని థియేటర్లలో అక్రమ పార్కింగ్ వసూళ్లు చేస్తున్నట్లు బయటపడిందని ఆమె తెలిపింది.