Homeహైదరాబాద్latest Newsఎంపీటీసీ ని సన్మానించిన స్నేహితులు

ఎంపీటీసీ ని సన్మానించిన స్నేహితులు

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: మెట్ పల్లి మండలం వేంపేట గ్రామంలో మాజీ ఎంపీటీసీ పుల్ల శేఖర్ గౌడ్ యొక్క ఎంపీటీసి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వేంపేట ఆత్మీయ మిత్రులు ఘనంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేంధర్ రెడ్డి మాట్లాడుతూ శేఖర్ గౌడ్ పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలకు, మరియు గ్రామ అభివృద్ధికి, తమవంతు సహాయ సహకారాలు అందించాడని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. సహాయ సహకారాలు అందించిన ప్రజలకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ప్రైవేట్ స్కూల్ల యాజమాన్యం అధ్యక్షుడు శ్రీ పుల్ల ప్రదీప్ గౌడ్, పల్లి‌ శేఖర్ గౌడ్, దశకంఠరాజు, బద్దం అంజిరెడ్డి, సామల్ల గంగాధర్, పెద్ది శ్రీనివాస్ గుప్తా, మ్యాడపు శేఖర్, ధర్మరాజు, పురుషోత్తం, ఇప్ప జలంధర్, రవి వర్మ మొదలగు వారు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img