Homeలైఫ్‌స్టైల్‌Lose weight : పండు మిర్చీతో అధిక బరువుకు చెక్​

Lose weight : పండు మిర్చీతో అధిక బరువుకు చెక్​

Researchers at the University of Vermont in the United States say that eating fruit chilies regularly can help you lose weight. To date, they have conducted research on 16,000 people.

నేటి తరుణంలో చాలా మందిని ఊబకాయ సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్నది. అధిక బరువు కారణంగా అనేక అవస్థలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం చాలా మంది అనేక పద్ధతులు పాటిస్తున్నారు. అయితే అధిక బరువు తగ్గాలంటే.. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి.

బరువును పెంచే ఆహారాలు కాకుండా బరువును తగ్గించే ఆహారాలు తినాలి. ఇక బరువును తగ్గించే ఆహారాల విషయంలో పండు మిరపకాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

వాటిని తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని పరిశోధనలో వెల్లడైంది.

పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గవచ్చని అమెరికాలోని వెర్మోంట్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు వారు 16వేల మందిపై పరిశోధనలు చేశారు.

దీంతో తేలిందేమిటంటే.. పండు మిరపకాయలను తరచూ తినడం వల్ల అధిక బరువు తగ్గుతారని సైంటిస్టులు నిర్దారించారు.

అలాగే పండు మిరపకాయలను బాగా తినేవారికి హార్ట్‌ ఎటాక్‌లు, పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.

పండు మిరపకాయల్లో ఉండే క్యాప్సెయిసిన్‌ అనే సమ్మేళనం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలో ఉండే బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది.

దీంతో మనకు ఆయుష్షు కూడా పెరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img