Homeఫ్లాష్ ఫ్లాష్జీ20 విందు.. ఖర్గేకు నో ఇన్విటేషన్ G20 dinner..

జీ20 విందు.. ఖర్గేకు నో ఇన్విటేషన్ G20 dinner..

– ఏఐసీసీ చీఫ్​ కార్యాలయం వెల్లడి

G20 dinner.. ఇదేనిజం, నేషనల్​ బ్యూరో: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా శుక్రవారం పలు దేశాధినేతలు భారత్​ కు విచ్చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ విందుకు ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఈ విషయంపై ఖర్గే ఆఫీసు క్లారటీ ఇచ్చింది. ఈ క్రమంలో అతిథులతో పాటు మాజీ ప్రధానులకు జీ20 విందుకు ఆహ్వానం అందింది. జీ20 సదస్సులో భాగంగా ప్రథమ పౌరురాలు ద్రౌపదీముర్ము ఈ విందు ఇవ్వనున్నారు. కేంద్రమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఈ విందు ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో భాగంగానే కేబినెట్‌ హోదా కలిగిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఖర్గేకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img