HomeరాజకీయాలుBRS లోకి గాలి అనిల్​ కుమార్

BRS లోకి గాలి అనిల్​ కుమార్

BRS లోకి గాలి అనిల్​ కుమార్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పీసీసీ ఉపాధ్యక్షుడు, ఆ పార్టీ మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి గాలి అనిల్‌కుమార్‌ను మంత్రి హరీశ్‌ రావు బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు అనిల్‌ రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే గురువారం తెల్లవారుజామున ఆయన ఇంటికి మంత్రి హరీశ్‌ వెళ్లారు. అక్కడే టిఫిన్ చేసిన మంత్రి.. బీఆర్ఎస్​లోకి రావాలని అనిల్‌ను ఆహ్వానించారు. దీంతో ఆయన గులాబీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నర్సాపూర్‌లో జరిగే సభలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. బీసీలకు అన్యాయం చేసినందున కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గాలి అనిల్‌కుమార్‌ చెప్పారు.

Recent

- Advertisment -spot_img