గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రానుంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ డిసెంబర్ 30న హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నారు అని తెలుస్తుంది. అలాగా ఈ సినిమా జనవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లో విడుదల కానుంది.